గుండు హనుమంతరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Mon,February 19, 2018 12:30 PM

CM KCR condolence to Comedian Gundu Hanumantha rao

హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హన్మంతరావును కాపాడడానికి వైద్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ, టీవీ రంగస్థలాల్లో తన నటన ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న హన్మంతరావు మరణం తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు.

2550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles