ఆదిరాజు వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Fri,June 15, 2018 09:38 AM

CM KCR Condolence to Adiraju Venkateswara Rao death

హైదరాబాద్: 1969 తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు, రచయిత, ప్రజాతంత్ర వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆదిరాజు వెంకటేశ్వరరావు రాత్రి 11:30 గంటలకు కన్నుమూశారు. ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్నారు. 1969 ఉద్యమ సమయంలో 21 రోజులు జైలుకెళ్లిన ఏకైక జర్నలిస్టు. ఆదిరాజు వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆదిరాజు ఎంతో పోరాడారని గుర్తు చేసుకున్నారు. పత్రిక, సాహితీ రంగానికి ఆదిరాజు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆదిరాజు వెంకటేశ్వరరావు కుటుంబానికి సీఎం కేసీఆర్ సానుభూతి తెలిపారు. ఖమ్మం జిల్లా పండితాపురంలో ఆదిరాజు వెంకటేశ్వరావు జన్మించారు.

1698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS