కాగ్‌ ధృవీకరించిన లెక్కలనే సభ ముందు పెట్టాం : సీఎం కేసీఆర్‌

Sat,September 14, 2019 01:27 PM

హైదరాబాద్‌ : బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆరు నెలల కోసం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రాష్ర్టానిదే. ప్రభుత్వం చెబుతున్న అంశాలు వాస్తవికానికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. విక్రమార్క వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. మాట్లాడే ధోరణిలో తప్పుగా మాట్లాడడమే కాకుండా సభను తప్పుదోవ పట్టించడం సరికాదు. బడ్జెట్‌ పాఠంలో వివరంగా చెప్పినాను. అందులో చూపించిన ప్రతి లెక్క కాగ్‌ చెప్పినవే. బడ్జెట్‌లో చూపించిన లెక్కలు వంద శాతం కరెక్ట్‌. రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు మిగులు బడ్జెట్‌ ఉండే అనుడు పెద్ద జోక్‌. మాట్లాడుతున్నామని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. విమర్శించొచ్చు కానీ లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చెప్పడం సరికాదు. కాగ్‌ ధృవీకరించిన లెక్కలనే సభ ముందు ప్రవేశపెట్టినం.


సత్యదూరమైన మాటలు మాట్లాడి సభ్యులను, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. దేశంలో మాంద్యం నెలకొని ఉంది. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. వాస్తవాలను ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెబుతాం. వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. రాష్ర్టాన్ని దివాళా తీయించలేదు. దేశంలో మనం నంబర్‌వన్‌గా ఉన్నాం. ఆర్థిక నిపుణులను సంప్రదించిన తర్వాతే బడ్జెట్‌ను రూపొందించాం. మాంద్యం ప్రభావంతో బడ్జెట్‌లో కోత పెట్టామని మేమే చెప్పాం. ప్రతి లెక్కను రేపు సభ ముందు పెడుతాం. సభలో ఏది పడితే అది మాట్లాడడం సరికాదు అని సీఎం కేసీఆర్‌ సూచించారు.

1339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles