ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన సీఎం కేసీఆర్‌

Tue,March 12, 2019 11:40 AM

CM KCR cast his vote in MLC elections at Assembly

హైదరాబాద్‌ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ అసెంబ్లీలోని కమిటీ హాల్‌-1లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 91 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లిస్‌ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు స్థానాల కోసం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి గూడూరి నారాయణరెడ్డి పోటీలో ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించింది. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నలుగురు, మజ్లిస్‌ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే కానుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మహముద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశం కాగా, మజ్లిస్‌ అభ్యర్థి రియాజ్‌.

1798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles