రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

Wed,February 17, 2016 11:55 AM

cm kcr birth day celebrations

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. హైదరబాద్‌తోపాటు రాష్ట్రంలోని ప్రతీ ఊరు, వీధి, వాడల్లో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి టీఆర్‌ఎస్ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వంద సంవత్సరాలు జీవించాలని ఆకాంక్షించారు.

మెదక్ జిల్లా పటాన్‌చెరులో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించి రాష్ర్టాన్ని సుభిక్షంగా పాలించాలని కాంక్షిస్తూ స్థానిక దుర్గామాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles