మానవ వనరుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం: సీఎం కేసీఆర్

Thu,January 18, 2018 03:04 PM

CM KCR attend India today south conclave 2018 in park hyatt hotel hyderabad

హైదరాబాద్: దేశంలోనే మానవ వనరుల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర‌మ‌ని సీఎం కేసీఆర్ అన్నారు . గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లన్న సిద్ధాంతంతో పనిచేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో 50 లక్షల గొర్రెల సంపదను సృష్టించాం. ఈ కార్యక్రమం ద్వారా లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించాం. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం దేశ విదేశాలకు గొర్రెలు, మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుంద‌ని సీఎం తెలిపారు. పార్క్ హయత్‌లో ఇండియాటుడే సౌత్‌కాన్‌క్లేవ్ 2018 జరగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. రాజ్‌దీప్ సర్‌దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు.

తెలంగాణ ఏర్పడ్డాక ఆరు నెలల్లో విద్యుత్ కష్టాలను అధిగమించామ‌న్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 6వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. ఇప్పుడు 14వేల మెగావాట్లకు పెంచాం. 2020 నాటికి 28వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. దేశంలోనే సంక్షేమ రంగంలో అనేక పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలువబోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణకు కేటాయించిన నీళ్లు.. లెక్కల్లో మాత్రమే కన్పిస్తాయి. వాస్తవంగా తెలంగాణకు త‌న‌ వాటా ఏనాడు దక్కలేదు. అందుకే మా హక్కులను సాధించేందుకే ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యత అంశంగా పూర్తి చేస్తున్నాం. మహబూబ్‌నగర్‌లో ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం. మా ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ సైతం మెచ్చుకుంది. 2020 నాటికి రాష్ట్రంలోని కోటి ఎకరాలు సస్యశ్యామలం అవుతాయ‌ని సీఎం తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాల క‌ష్టాలు లేకుండా ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది నుంచి రైతులకు ఎకరాకు రూ.8వేల చొప్పున పెట్టుబడి అందిస్తున్నాం. దీని ద్వారా 71 లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుంద‌న్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలపకముందు కూడా ధనిక రాష్ట్రమే. మాకు ఎవరితోనూ పోటీ లేదు, పోలిక లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే మేం పాటిస్తున్న విధానం. తెలంగాణలో భవిష్యత్‌లో రైతుల ఆత్మహత్యలు ఉండవు. నీటి వనరులన్నీ కబ్జా చేసి, అందమైన హైదరాబాద్ నగరాన్ని ధ్వంసం చేశారు. హైదరాబాద్‌కు గార్డెన్ సిటీగా పూర్వ వైభవం తీసుకురావడమే మా లక్ష్యం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఎక్కువగా ఉన్నారు. 50 శాతం రిజర్వేషన్ రాష్ట్రానికి సరిపోదు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి. టీఎస్‌ఐపాస్‌తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతిస్తున్నం. తెలంగాణ దేశంలోనే ధనిక రాష్ట్రంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. యావత్ తెలంగాణ నా కుటుంబం. నా భావోద్వేగాలు తెలంగాణ చుట్టే ఉంటాయి. ఎన్నారై పాలసీతో గల్ఫ్ బాధితులు ఆదుకుంటాం. 1969 ఉద్యమకారులను గౌరవించుకుంటామన్నారు.

3901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles