విజయవాడకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

Mon,June 17, 2019 01:00 PM

CM KCR at Vijayawada

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయవాడకు చేరుకున్నారు. మరికాసేపట్లో కనకదుర్గమ్మను సీఎం కేసీఆర్‌ దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తాడేపల్లిలోని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాసానికి కేసీఆర్‌ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగన్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి కేసీఆర్‌ వెళ్లనున్నారు. శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణకు సీఎం కేసీఆర్‌ హాజరు కానున్నారు. రాత్రి 7:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. సీఎం కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌ ఉన్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

1560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles