అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

Sun,September 2, 2018 06:25 PM

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభా వేదిక వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రజలకు అభివాదం చేశారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి ఉన్నారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.


ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు క్యాంపు ఆఫీస్ నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడ్నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రగతి నివేదన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. హెలికాప్టర్ ల్యాండ్ అయికంటే ముందు.. కేసీఆర్.. ప్రగతి నివేదన సభా ప్రాంగణాన్ని వీహంగ వీక్షణం ద్వారా చూశారు.

2191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles