సూర్యాపేటపై సీఎం వరాల జల్లు

Thu,October 12, 2017 08:08 PM

CM KCR announce funds to Suryapet district

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాల జల్లు ప్రకటించారు. సూర్యాపేట పర్యటన సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రగతిసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మిషన్ కాకతీయ ద్వారా ప్రతీ మండలంలో చెరువులు ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా సరే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నమన్నారు. ఏ ఊరైనా ఏ తండా అయినా తనదేనన్న సీఎం ఈ సందర్భంగా సూర్యాపేటకు పలు వరాలను ప్రకటించారు.
- సూర్యాపేట అభివృద్ధికి రూ. 75 కోట్లు
- వచ్చే ఏడాది బడ్జెట్‌లో పాత నల్లగొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు
- ఒకటి పాత నల్లగొండలో మరొకటి సూర్యాపేటలో
- సూర్యాపేటలోని ప్రతీ గ్రామ పంచాయతీకి రూ. 15 లక్షలు
- ప్రతీ తండాకు రూ. 10 లక్షలు
- సూర్యాపేట పుల్లారెడ్డి చెరువును బాగుచేయడం
సూర్యాపేట జిల్లాలో ప్రతీ ఇంటికీ ఆరు మొక్కలు పెంచాలని సీఎం ప్రజలను కోరారు. వెయ్యి కోట్లు అప్పు తెచ్చయినా సరే పాత నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేస్తానని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. త్వరలోనే కోదాడలో పర్యటించనున్నట్లు తెలిపారు.

1905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS