జగదీశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం, గవర్నర్

Wed,July 18, 2018 05:35 PM

cm and governor wishes minister jagadeesh reddy on his birthday

హైదరాబాద్: మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలియజేశారు. జగదీశ్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను ఇవాళ ఉదయం ఎర్రవెల్లిలో ఉన్న సీఎం ఫామ్ హౌస్లో కలిశారు. ఈసందర్భంగా సీఎం మంత్రికి తన ఆశీస్సులు అందజేశారు. అదే విధంగా గవర్నర్ నరసింహన్ మంత్రి జగదీశ్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు.

ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. యాదాద్రి జిల్లాలో జరిగిన మంత్రి జన్మదినోత్సవ వేడుకల్లో శాసనమండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, శాసనసభ్యులు గాదరి కిషోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగడి సునితతో పాటు స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు రవీందర్, నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, తదితరులు హాజరయ్యారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో, నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో మంత్రి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సతీమణి


మంత్రి పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని 30 వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి సతీమణి సునీత ప్రారంభించారు.

1147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles