చీఫ్ జ‌స్టిస్ వేధించాడు : మాజీ ఉద్యోగి

Sat,April 20, 2019 11:53 AM

CJI Gogoi sexually harassed me, complains ex employee

హైద‌రాబాద్: సుప్రీంకోర్టుకు చెందిన 35 ఏళ్ల ఓ మాజీ మ‌హిళా ఉద్యోగిని చీఫ్ జ‌స్టిస్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసింది. 2018 అక్టోబ‌ర్ 10 లేదా 11వ తేదీన చీఫ్ జ‌స్టిస్ ఆ మ‌హిళ‌పై లైంగిక దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సీజే త‌నను హ‌త్తు కున్నార‌ని, త‌న న‌డుమును గ‌ట్టిగా ప‌ట్టుకున్నార‌ని, త‌న శ‌రీరాన్ని చేతుల‌తో అంత‌టా ట‌చ్ చేశార‌ని, అత‌ని శ‌రీరంతో త‌న శ‌రీరాన్ని గ‌ట్టిగా ప్రెస్ చేశార‌ని మాజీ ఉద్యోగి త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టుకు రాసిన క‌వ‌రింగ్ లెట‌ర్‌లో ఆమె ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న‌ను గ‌ట్టిగా ప‌ట్టుకోవాలంటూ కూడా సీజే కోరాడ‌ని, అత‌ని చెర నుంచి త‌ప్పించుకునేందుకు తాను గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేయాల్సి వ‌చ్చింద‌ని ఆమె త‌న అఫిడ‌విట్‌లో తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల‌కు రాసిన లేఖ‌లో ఆమె ఈ విష‌యాల‌ను పూర్తిగా వెల్ల‌డించారు.

2014 నుంచి తాను సుప్రీం కోర్టులో జూనియ‌ర్ అసిస్టెంట్‌గా ప‌ని చేశాన‌ని చెప్పారు. కానీ అన్యాయంగా త‌న‌ను విధుల నుంచి తొల‌గించార‌న్నారు. సీజేఐకి స‌హ‌క‌రించ‌లేద‌ని త‌న‌ను విధుల నుంచి తొల‌గించిన‌ట్లు ఆమె పేర్కొన్న‌ది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఆమె ట‌ర్మినేట్ చేశారు. ఆ త‌ర్వాత ఢిల్లీ పోలీసు శాఖ‌లో ప‌నిచేసే భ‌ర్త‌, సోద‌రుల‌ను కూడా అన్యాయంగా తొల‌గించార‌న్నార‌ని ఆమె తెలిపింది. కోర్టులో గ్రూపు డి ఉద్యోగం చేసే త‌న భ‌ర్త సోద‌రుడిని కూడా తొల‌గించార‌ని పేర్కొన్న‌ది. త‌న‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల ప‌ట్ల మాజీ సీనియ‌ర్ జడ్జిల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆమె డిమాండ్ చేసింది. ఈ కేసు నేప‌థ్యంలో ఇవాళ సుప్రీం బెంచ్ ఒక‌టి ప్ర‌త్యేకంగా విచార‌ణ చేప‌ట్టింది. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు కొట్టిపారేసిన సీజేఐ.. ప్ర‌తి ఉద్యోగిని స‌మానంగా, గౌర‌వంగా చూసిన‌ట్లు తెలిపారు. ఆ ఉద్యోగిని త‌న దగ్గ‌ర కేవ‌లం నెలన్న‌ర రోజులు మాత్ర‌మే ప‌నిచేసింద‌న్నారు. ఆ ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వ‌చ్చే వారం కీల‌క కేసులు ఉన్నాయ‌ని, వాటి నుంచి దృష్టి మ‌ళ్లించేందుకు ఈ ఆరోప‌ణ‌లు చేశార‌ని సీజేఐ ఇవాళ తెలిపారు.

1262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles