‘తడిసిన ధాన్యం’ వార్తపై స్పందించిన అధికారి

Fri,May 24, 2019 08:33 AM

Civil supply officer reacts on grain issue


వికారాబాద్ : వర్షానికి తడిసిన ధాన్యం అనే వార్త ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితం కావడంతో స్పందించింది. గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పద్మజ స్పందించారు. జిల్లాలో కురిసిన అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని తెలిపారు.

రైతులు నిరాశ చెందకుండా తమ వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే తమ దగ్గరలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెను వెంటనే సంబంధిత రైస్‌ మిల్లులకు తరలిస్తామన్నారు. జిల్లాలో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 24/27, కొనుగోలు చేసిన ధాన్యం 6,882 టన్నులు, రైతుల సంఖ్య 2,215 మంది, రైస్‌ మిల్లులకు తరలించింది 6,107 టన్నులు, రైతుల ఖాతాల్లో జమ చేసిన సొమ్ము రూ.4.29 కోట్లు అని తెలిపారు. రైతులు నిరాశ చెందకుండా అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మేలు చేస్తుందన్నారు.

667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles