చిట్టీ వ్యాపారి కుచ్చుటోపీ.. 5 కోట్లు ఎగనామం

Mon,November 5, 2018 11:05 PM

chitti businessman cheated customers in bhadradri kothagudem district

వ్యాపారి ఇంటికి తాళం వేసిన బాధితులు
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో చిట్టీలు కట్టించుకుంటూ సుమారు రూ.5 కోట్ల డబ్బుతో వ్యాపారి ఉడాయించి బాధితులకు కుచ్చుటోపీ పెట్టిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుంచి దమ్మపేటకు గత కొన్నేళ్ల క్రితం వలసవచ్చిన రాజు దమ్మపేటలో ఓ దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. కొంత కాలానికే వస్త్ర దుకాణాన్ని ప్రారంభించి, ఆ వృత్తిని చేపడుతూ అనధికారికంగా చిట్టీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. చిట్టీలతో పాటు దమ్మపేట సమీప ప్రాంతాలకు చెందిన పలువురి వద్ద నుంచి వడ్డీకి అప్పులు సైతం తీసుకువచ్చి వ్యాపారం చేస్తూనే సాయిబాబా గుడి వీధిలో విలాసవంతమైన ఇంటిని నిర్మించడంతో పాటు కారు కూడా కొనుగోలు చేసి వ్యాపారంలో ప్రజలకు నమ్మకాన్ని కలిగించాడు.

అయితే అశ్వారావుపేటలో చిట్టీల వ్యాపారి ఇటీవల దివాళా ప్రకటించిన సంగతి తెలుసుకున్న రాజును అప్పులు ఇచ్చిన వారంతా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచడంతో ఈ వ్యాపారి రెండు రోజుల క్రితం కుటుంబంతో చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యాడు. దీంతో బాధితులు అతని ఇంటి వద్ద ఆరా తీయగా.. చుట్టుపక్కల వారికి విజయవాడ ఆసుపత్రికి వెళుతున్నట్లు చెప్పాడని, ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా తన వద్ద ఉన్న ఫోన్ సైతం స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో బాధితుల్లో మరింత గుబులు మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు చిట్టీ వ్యాపారి రాజు ఇంటికి వెళ్లి తాళాలు వేశారు. అనంతరం బాధితులందరూ కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కూలీ, నాలీ చేసుకుని జీవనం సాగిస్తూ దాచుకున్న సొమ్ము పోయిందంటూ బాధితులు లబోదిబోమంటున్నారు.

1898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles