చింతకింది మల్లేశంకు పద్మశ్రీ

Wed,January 25, 2017 04:04 PM

chintakindi mallesham inventor of the Laxmi Asu Machine got Padmashree

హైదరాబాద్: స్కూల్ డ్రాపౌట్ చింతకింది మల్లేశంకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. చేనేతకు సంబంధించిన యంత్రాన్ని కనుగొన్నందుకు గానూ ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఇవాళ కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ విజేతల జాబితాలో యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశం ఉన్నారు.

చేనేత కార్మికుల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఇలా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని(25 కి.మీ) రెండు చీరలు తయారు కావు. రెండు చీరలు నేస్తే గాని నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లవు. చేతులు లాగుతున్నాయి బిడ్డా అంటే ఆ కొడుకు మనసు తల్లడల్లిపోయింది. అమ్మ భుజం నొప్పితో రోజంతా బాధపడుతుంటే అమ్మ కష్టం కట్టేక్కేదెలా?..ఏదో ఒకటి చేయాలి...ఇంతలో మెదడులో ఆలోచన మెదలింది.

ఆ ఆలోచనే ఆసుయంత్రానికి పురుడు పోసుకుంది. అమ్మ పేరుమీదనే లక్ష్మీ ఆసుయత్రం అని పేరు పెట్టాడు. అతడే మన చింతకింది మల్లేశం. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట అనే మారుమూల గ్రామీణ చేనేత కార్మికుడు ఈ మల్లేశం 2000ల సంవత్సరంలో ఈ యంత్రం కనిపెట్టాడు.

మిషన్ అంటే యంత్రాలతో హడావిడగా ఉండదు. రెండు తక్కవ కెపాసిటీ గల మోటర్లు, వుడ్ ఫ్రేమ్. అంతే ఎలాటి శారిరక శ్రమ లేకుండా ఒక చీర ఆసుపోయవచ్చు. రోజుకు రెండు చీరలు నేసేవాళ్లు ఈ యంత్రం వచ్చాక ఆరు నుంచి ఏడు చీరలు నేస్తున్నారు. మామూలు ఆసుపోయడం వల్ల ఐదు నుంచి ఆరు గంటల సమయం ఒక్క చీర నేయడానికి సమయం పడుతుంది. అదే లక్ష్మీ ఆసుయంత్రంతో గంటన్నర సమయంలో ఒక చీర నేయవచ్చు.2011 సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం చివర్లో ఫోర్బ్స్ జాబితాల మల్లేశం పేరు వచ్చింది. 2011లో ఆసుయంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది. ఇలా అనేక ప్రశంసలు, అవార్డలు, రివార్డులు అందుకున్న మల్లేశం ఆశయం ఒకటే. వీలైనన్ని చేనేత కుటుంబాలకు లక్ష్మీ ఆసుయంత్రాన్ని సరఫరా చేయాలి. 2017 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం చింతకింది మల్లేశాన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించనుంది. గతంలో నాటి రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్‌తోపాటు పలువురు ప్రముఖుల పలు అవార్డులు అందుకున్నాడు. మల్లేశం ప్రస్తుతం ఆలేరులో చేనేతవృత్తిలో కొనసాగుతూ ఆలేరు మండల సిల్క్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.

3062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS