చదువుతో పాటు సంప్రదాయాలు నేర్పాలి

Wed,April 24, 2019 08:12 PM

china jeeyar swamy participated in tiru nakshatra celebrations in warangal

వరంగల్: ప్రతీ కుటుంబం తమ పిల్లలకు చదువుతో పాటు సంప్రదాయాలు నేర్పించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి సూచించారు. మహోపాధ్యాయ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల 94వ తిరునక్షత్రోత్సం వేడుకలను వరంగల్ హంటర్‌రోడ్డులోని కొడం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. ఆచార్యస్వామి తిరునక్షత్రోత్సం ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సముద్రాల శఠగోపాచార్యులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సత్సంప్రదాయ సభకు ముఖ్య అతిథులుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామితో పాటు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్రరామానుజ జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీసంపత్కుమార రామనుజజీయర్ స్వామి హాజరై అనుగ్రహ భాషణం చేశారు.

ఈ సందర్భంగా రామానుజ చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. సంప్రదాయాలు ఇంకా కొనసాగాలంటే కన్యకా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ముందు హైదరాబాద్‌లో, తరువాత ప్రతీ జిల్లాలో కన్యకా పాఠశాలలను ఏర్పాటు చేస్తే సంప్రదాయాలను నేర్పుతామని అన్నారు. రామానుజుల వారసులమైన మనం సంకల్పం చేసుకోని ముందుకుపోవాలన్నారు. అనంతరం కంచి శ్రీమాన్ పీబీ.రాజహంస స్వామి, ప్రొఫెసర్ నరసింహాచార్య స్వాములకు శ్రీరఘునాథదేశిక విశిష్ట పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సత్సంప్రదాయ పరిరక్షణ సభ అధ్యక్షులు సముద్రాల పురుసోత్తమాచార్యులు, ఆహ్వాన సంఘం కార్యదర్శి ఎలగందుల వదరారెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, భాలకిషన్, నరసింహాచార్యులు, మనోహారాచార్యులు, వనం లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు.

1341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles