బాలల పండుగ బాలోత్సవ్ ప్రారంభం

Fri,November 13, 2015 11:09 AM

Childrens day in Kothagudem

ఖమ్మం : బాలల దినోత్సవం పురస్కరించుకుని కొత్తగూడెంలో జాతీయస్థాయి బాలోత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. బాలోత్సవ్ వేడుకలను బాల మేధావి సాధిఖ్ పాషా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో 9 రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారు.

వేదికల వివరాలు...
తొలిరోజు జరగనున్న చిత్రలేఖనం పోటీలు 2,3,4, లాన్, ఏసీ ఆడిటోరియం, శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో జరగనున్నాయి. వక్తృత్వం పోటీ లు కేసీవోఏ క్లబ్‌లో, వీధి నాటిక పోటీలు శుభమస్తు ఫంక్షన్ హాల్ వద్ద, ఏసీ ఆడి టోరియంలో లఘుచిత్ర పోటీ, కేసీవోఏ క్లబ్‌లో సినీ, లలిత, జానపద గీతాల పోటీలు, స్టేజ్ నంబర్-2 వద్ద కవితా రచన పోటీలు, భరత నాట్యం సబ్ జూని యర్స్ పోటీలు కొత్తగూడెం క్లబ్ ఎదురుగా ఉన్న రైటర్‌బస్తీ గణేష్ టెంపుల్ ప్రాం గణంలో జరగనున్నాయి.

కొత్తగూడెం క్లబ్‌లోని స్టేజ్ నంబర్-1 వద్ద కథా విశ్లేషణ, ఏసీ హాల్ నంబర్-3లో కూచిపూడి సబ్‌జూనియర్స్ పోటీలు. స్టేజ్-4 శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో జానపద నృత్యం పోటీలు, స్టేజ్-1 వద్ద క్విజ్, తరువాత నాటిక పోటీలు జరగనున్నాయి.

1940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles