అరూరికి చిన్నారుల చిరు కానుక

Wed,November 14, 2018 10:40 PM

children donated money for election expenditure to aruri ramesh

ఐనవోలు: వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు చిన్నారులు చిరు కానుకను అందజేశారు. బుధవారం వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం అరూరి రమేశ్ కుటుంబ సభ్యులతోపాటు కార్యకర్తలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఐనవోలు మండలంలోని కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన చిన్నారులు వేముల చాతుర్య, బ్రహ్మిణి తమ కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న రూ. 5000ను ఎన్నికల ఖర్చుల కోసం అరూరి రమేశ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు చూపించిన ప్రేమకు అరూరి ముగ్ధుడై భద్రకాళి అమ్మవారు తన గెలుపునకు చిన్నారుల ద్వారా అందించిన ప్రసాదంగా భావించి స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

1309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles