బాల భీముడు జన్మించాడు...

Sat,February 23, 2019 09:10 AM

child was born 4.7 kg in sangareddy hospital

సంగారెడ్డి : జిల్లా దవాఖానలో మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో ఓ మహిళ మగ బిడ్డకి జన్మనిచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి, పర్వేద గ్రామానికి చెందిన అనూష, నర్సింహులు భార్యా భర్తలకు ఇది రెండవ సంతానం. మొదటి కాన్పులో అబార్షన్ కాగా రెండో కాన్పులో బాల భీముడు జన్మించాడు. కాగా ఆ మగబిడ్డ 4.75 కేజీల బరువు ఉన్నాడు. వైద్యులు మహిళకు నార్మల్ డెలివరీ చేసి బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. సాధారణంగా డెలివరీలో 2.50, 3.0, కేజీలు ఉంటారు. కానీ ఏకంగా 4.75 కేజీల బరువుతో పుట్టడం విశేషం అని వైద్యులు చెబుతున్నారు. ఈ బాలభీముడిని చూడడానికి దవాఖానలోని ప్రజలు తరలివస్తున్నారు.

6639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles