మతిస్థిమితం కోల్పోయిన తండ్రి చేతిలో చిన్నారి హతం

Sun,January 21, 2018 10:14 PM

Child lost life mad father hands

ఉండవెల్లి : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘోరం జరిగింది. కన్నకూతురిని నీళ్ల బకెట్‌లో ముంచి చంపిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, వెన్నెల భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం కాగా, ఐదు నెలలక్రితం పాప జన్మించింది. కాన్పు కోసం పుట్టింటికి(ఇదే మండలం భైరాపురం) వెళ్లిన వెన్నెల ఐదు నెలలు నిండడంతో గత శనివారమే మెట్టినింటికి వచ్చింది.

సాయంత్రం వెన్నెల ఇంట్లో పనిలో ఉండగా తన కూతురిని ఎత్తుకొని వెళ్లిన విజయ్‌కుమార్ ఇంటిముందు నీళ్లబకెట్‌లో ముంచడంతో ఊపిరాడక చనిపోయింది. కళ్లముందు ఉండే చిన్నారి అప్పుడే కన్ను మూయడంతో కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతు విజయ్‌కుమార్‌కు వెన్నెల రెండో భార్య. మొదటి భార్య ఇతని ప్రవర్తన నచ్చక భర్త నుంచి విడిపోయింది. పోలీసులు గ్రామానికి చేరుకొని, ఘటనా వివరాలను తెలుసుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు.

1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles