రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ ఐదేండ్ల చిన్నారి గుర్తింపు...

Tue,March 26, 2019 06:47 AM

Child Identified on Kacheguda Railway Station Platform

కాచిగూడ : ఓ చిన్నారి కాచిగూడ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం-5లో తిరుగుతుండగా అస్రీత చైల్డ్ హెల్ప్ డెస్క్ ప్రతినిధులు రాము, పద్మ, అనితలు చేరదీసారు.అస్రీత చైల్డ్‌హెల్ప్ డెస్క్ ప్రతినిధి రాము తెలిపిన వివరాల ప్రకారం... గుర్తుతెలియని చిన్నారి(5) కాచిగూడ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్-5లో దిగి దిక్కులు చూస్తూ తిరుగుతుండగా అదే సమయంలో విధుల్లో ఉన్న అస్రీత చెల్డ్ హెల్ప్ డెస్క్ ప్రతినిధులు ఆ చిన్నారిని దగ్గరకు తీసుకొని కుటుంబ సభ్యుల వివరాలు అడిగారు. కానీ చిన్నారి సమాధానం చెప్పలేకపోవడంతో యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు తరలించారు. వివరాలకు 9398390460 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. చెన్నయ్య, ఎల్లస్వామి తదితరులు ఉన్నారు.

3354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles