పసికందును చంపి, కవర్లో మూటకట్టి..

Fri,August 23, 2019 06:30 AM

child folded in a cover after murder in badangpet


బడంగ్‌పేట : ఓ పసికందును చంపి కవర్లో మూటకట్టి పడేసిన ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందన వనంలోని బ్లాక్‌ నంబర్‌ 27లో స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు ఉదయం వాకింగ్‌ చేస్తుండగా, కవర్లో నుంచి రక్తం కారుతున్న దృశ్యం కనిపించింది. స్థానికులు కవర్లో చూడగా ఓ పసికందు మృతి చెంది ఉన్నట్లు గుర్తించి మీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. ఎవరో అబార్షన్‌ చేయించుకొని 6 నెలల పసికందును మూట గట్టి పడేశారని సీఐ యాదయ్య తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

1619
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles