అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నారని...చిత్రహింసలు

Wed,June 19, 2019 05:43 PM

child beaten by mother for her Fornication

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గౌతంపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న రూప అనే మహిళ ఇండ్లలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. గత కొంతకాలంగా ఆటోడ్రైవర్‌ బోనగిరి రాజేశ్‌ అలియాస్‌ బప్పి అనే వ్యక్తితో రూప వివాహేత‌ర సంబంధం కొనసాగిస్తుంది. వీరి అక్రమసంబంధానికి పిల్లలు శ్రీప్రియ(5), హేమశ్రీ వయస్సు (8) అడ్డు వస్తున్నారని చిత్రహింసలకు గురిచేశారు. ఈ రోజు రూప అన్న ఒర్సు కుమార్‌ భార్య రూప ఇంటికి వెళ్లగా పిల్లలు గాయాలతో ఉన్నారు. ఏం జరిగిందని పిల్లలను విచారించగా రూప, బప్పిలు బెల్టుతో కొట్టారని, కత్తి కాల్చి వాతలు పెట్టారని ఏడ్చుకుంటూ చెప్పారు. విషయం తెలుసుకున్న ఒర్సు కుమార్‌ చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి రూప, బప్పిలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తన్నారు.

5577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles