మానవ తప్పిదాల వల్లే ఈవీఎం, వీవీప్యాట్‌లతో సమస్యలు

Fri,December 7, 2018 07:51 PM

Chief electoral officer Rajat Kumar press meet over election

హైదరాబాద్: సాయంత్రం 5 గంటల వరకు 67శాతంకు పైగా పోలింగ్ అయిందని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఇంకా పలు చోట్ల పోలింగ్ కొనసాగుతోందని వెల్లడించారు. గత ఎన్నికల ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లే కొన్ని చోట్ల ఈవీఎం, వీవీప్యాట్‌లలో సమస్యలు తలెత్తాయి. 754 బ్యాలెట్ యూనిట్లు, 628 కంట్రోల్ యూనిట్లు మార్చాం. 1444 వీవీ ప్యాట్ యంత్రాలు మార్చాం. మొత్తం 4,292 ఫిర్యాదుల్లో 642 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా మొత్తం రూ.138 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం. రూ.1172 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం. 2014లో రూ.76 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం. రూ.116 కోట్ల విలువజేసే 54 లక్షల లీటర్ల మధ్యం స్వాధీనం చేసుకున్నాం. ఓటర్ల జాబితాలో గల్లంతైన పేర్లపై త్వరలో చేపట్టబోయే సవరణలో ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

1322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles