ఎల్లుండి రాష్ర్టానికి ఈసీ ప్రతినిధులు: రజత్ కుమార్

Sun,September 9, 2018 08:19 PM

Chief Electoral Officer of Telangana to meet CEC tomorrow Rajat Kumar

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు సీఈసీ పనులు మొదలు పెట్టిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఎల్లుండి రాష్ర్టానికి ఈసీ ప్రతినిధులు రానున్నారని ఆయన అన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారన్నారు. 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏర్పాట్లను పరిశీలించి సీఈసీకి వివరిస్తారన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలపై సీఈసీ ప్రకటన చేస్తుందన్నారు.

రేపు ఢిల్లీకి రజత్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శాసనసభ ఎన్నికల నిర్వహణపై రజత్‌కుమార్‌తో ఈసీ చర్చించనుంది.

3204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles