ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

Fri,March 29, 2019 09:39 AM

Cheating name of government jobs

హైదరాబాద్ : నగరంలోని జవహర్‌నగర్ లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి... భారీగా డబ్బులు వ సూలు చేసి మోసం చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ వివరా లు వెల్లడించారు. కీసర మండలం, దమ్మాయిగూడకు చెందిన శివకృష్ణ (శివారెడ్డి), నిజాంపేటకు చెందిన పోతురాజు( ప్రతాప్)లు ప్రభుత్వ రంగ సంస్థల్లో ( రైల్వే, బ్యాంక్, మెట్రో ట్రైన్) ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. వీరి మాటలు నమ్మి చాలామంది నిరుద్యోగులు భారీగా వారికి డబ్బులు ఇచ్చారు. అయితే ఉద్యోగాల కోసం బాధితులు వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో శివకృష్ణ, పోతురాజులు పథకం ప్రకారం కూకట్‌పల్లికి చెందిన రంగాల నర్సింగరావు, కృష్ణ జిల్లా గుడివాడకు చెందిన తారక్( రమేశ్), సంతోశ్‌లను బాధితులకు ఉన్నతాధికారులుగా పరిచయం చేశారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలను చూపించి.. రెండో విడతగా 20 మంది బాధితుల నుంచి రూ. 75 లక్షల వరకు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో కొందరు బాధితులు ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్‌ఓటీ పోలీసులు నిందితులు శివకృష్ణ , పోతురాజు, మహేశ్, నర్సింగరావులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 27 లక్షలతో పాటు న కిలీ నియామక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

1505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles