బంగారానికి మెరుగు పెడుతానని మోసం

Sat,November 9, 2019 09:45 PM

కేసముద్రం : బంగారానికి మెరుగు పెడుతానని చెప్పిన వ్యక్తిని నమ్మి ఓ మహిళ మోసపోయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామంలో మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇత్తడి వస్తువులకు, స్టీల్ వస్తువులకు, బంగారు నగలకు మెరుగుపెడుతానని గ్రామంలో తిరుగుతున్నారు. ఈ క్రమంలో రేణుక వారిని పిలిచి మొదట కాలి మెట్టలను తీసి ఇవ్వగా కడిగి ఇచ్చారు. తర్వాత తన మెడలోని రెండు తులాల పుస్తెల తాడును ఇచ్చింది. సదరు వ్యక్తులు దానిని రెండు సార్లు నీటిలో కొంత సమయం తరువాత ఓ పుస్తెల తాడును తీసి పసుపు రాసి గంట తరువాత కడగమని అక్కడి నుంచి వెళ్లిపోయారు. గంట తరువాత బాధితురాలు దానిని కడుగగా నలుపు రంగులో ఉంది. అయోమయానికి గురైన రేణుక బంగారపు పుస్తెల తాడు చేయించిన వ్యక్తి వద్దకు వెళ్లి చూపించగా అది బంగారం తాడు కాదని, నకిలీదని చెప్పాడు. దీంతో మోసపోయానని గుర్తించిన సదరు మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.

794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles