బల్దియా బదిలీల్లో మార్పులు

Thu,October 18, 2018 06:00 AM

Changes in GHMC Transfers

ముషీరాబాద్ : జీహెచ్‌ఎంసీ చార్మినార్ జోన్ కమిషనర్ రవి కిరణ్‌ను ఎన్నికల విభాగం(హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్) అదనపు కమి షనర్‌గా బదిలీచేశారు. ఆయన స్థానంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు బుధ వారం కమిషనర్ దానకిషోర్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతోపాటు ఇటీవలే బదిలీచేసిన డిప్యూటీ కమిషనర్ పోస్టుల్లో సైతం మార్పులు చేర్పులు చేశారు. మరికొందరు ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన అధికారులకు కూడా బల్దియాలో పోస్టింగ్‌లు కల్పిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులోభాగంగా గ్రేడ్- 1 మున్సిపల్ కమిషనర్ జి. ఉమాప్రకాష్‌ను ముషీరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. ముషీరాబాద్ డీఎంసీగా అదనపు బాధ్యతలు చూస్తున్న గోషామహెల్ డీఎంసీ సేవా ఇస్లావత్‌ను అక్కడికి పరిమితం చేశారు. గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్‌ను మలక్‌పేట్ డీఎంసీగా నియ మించారు. అక్కడ అదనపు బాధ్యతల్లో ఉన్న సంతోష్‌నగర్ డీఎంసీ అలివేలు మంగతాయారును అదనపు బాధ్యతలనుంచి విముక్తి కల్పించారు. పరిపాలనా విభాగం సంయుక్త కమిషనర్ పి. సరోజను యుసుఫ్‌గూడ డిప్యూటీ కమిషనర్ గా నియమించి ఆ సర్కిల్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న యాదగిరిరావుకు ఇన్‌చార్జి బాధ్యతలనుంచి విముక్తి కల్పించారు.

అలాగే, మూసాపేట్ డిప్యూటీ ప్రాజెక్టు ఆఫీసర్ పి. సరళమ్మను చార్మినార్ డీఎంసీగా బదిలీచేసి అక్కడి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డి. సుమన్‌రావును అదనపు బాధ్యతల నుంచి విముక్తిచేశారు. చీఫ్ వ్యాల్యువేషన్ పి. రవీందర్‌కుమార్‌కు ప్రస్తుత బాధ్యతలతోపాటు అదనంగా చార్మినార్ జోన్ సంయుక్త కమిషనర్‌గా నియ మించారు. సహాయ మున్సిపల్ కమిషనర్ ఏ. రమేష్‌ను కుత్బుల్లాపూర్ డిప్యూ టీ కమిషనర్‌గా ఇటీవలే నియమించినప్పటికీ దాన్ని మార్పుచేస్తూ పరిపాలనా విభాగం సంయుక్త కమిషనర్‌గా నియమించారు. ఈ పోస్టింగులు, మార్పులు చేర్పులు వెంటనే అమల్లోకి వచ్చినట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు

1141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles