‘సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రతీ జిల్లాకు నిధులు’

Fri,May 19, 2017 08:35 PM


హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రతీ జిల్లాకు నిధులివ్వాలని నిర్ణయించామని మంత్రి చందూలాల్ తెలిపారు. ప్రతీ జిల్లాకు రూ.5 లక్షలు నిధులివ్వనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్లతో మంత్రి చందూలాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్లతో సమీక్షించారు. సమీక్షలో మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఏదైనా జిల్లాలో విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తే అదనంగా రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరో 500 మంది వృద్ధ కళాకారులకు పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లో 10 విభాగాల్లో వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

224

More News