చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి తలసాని

Sat,April 13, 2019 12:44 PM

Chandrababu holds the fear of defeat says minister Talasani Srinivas yadav

హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకి ఓటమి భయం పట్టుకుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికలు, పోలింగ్ సరళిపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారన్నారు. ఓటు వేసిన ప్రజలకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలవబోతుందన్నారు. గులాబీ పార్టీ అంటే ఇంటి పార్టీగా ప్రజలు భావిస్తున్నారన్నారు. ఏపీ ఎన్నికల తీరుపై మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో పోలింగ్ శాతం బాగుందన్నారు. పోలింగ్‌పై టీడీపీ డ్రామాలాడుతోందన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ఈసీని కలిశారన్నారు. ఏపీ ఎన్నికల్లో దాదాపు 42 వేల ఈవీఎంలు వాడితే అందులో 300 ఈవీఎంలలోనే సమస్యలు తలెత్తాయి. ఆ 300 ఈవీఎంలపైనే టీడీపీ ఆధారపడి ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలన్నారు. నోరు తెరిస్తే అన్ని అబద్దాలేనన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఆయనపై కేసులు లేవా? స్టేలు తెచ్చుకోలేదా? అన్నారు. తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు చేయాల్సిన కుట్రలన్నీ చేశారన్నారు. ఓట్ల కోసం ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

1860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles