కొండా సురేఖపై చల్లా ధర్మారెడ్డి గెలుపు

Tue,December 11, 2018 12:02 PM

challa Dhrma reddy wins from Parakala

వరంగల్ : కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖపై టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పరకాల ప్రజలు తనను మరోసారి ఆశీర్వదించారని.. ఈ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు. తాను ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రిలో ఉంటే కొండా దంపతులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. నాడే తాను చెప్పాను.. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవడీ నరాలు తెగుతాయో? టీవీలు, రిమోట్లు, సెల్‌ఫోన్లు పగులుతాయో? వేచి చూడండని చెప్పానని ధర్మారెడ్డి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో చాలా వింతలు చూడాల్సి వస్తదని కొండా దంపతులను ఉద్దేశించి ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. పరకాల నియోజకవర్గంపై కాకినాడ, అమలాపురంలో వంద కోట్లు బెట్టింగ్ పెట్టారంట అని తెలిపారు. రాజకీయ శత్రుత్వం ఉండకూడదన్న.. ఆయన రౌడీయిజం చేయడం సరికాదన్నారు.

3165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles