రైళ్లలో చైన్‌స్నాచింగ్‌

Mon,July 17, 2017 06:32 AM

కంటోన్మెంట్ : రైళ్లలో గొలుసుదొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) అరెస్టు చేసింది. ఆర్‌పీఎఫ్‌కు అనుసంధానంగా క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ స్వాడ్(సీపీడీఎస్) నేరగాళ్లను పట్టుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేట్‌కు చెందిన నల్ల రాకేశ్ (21), బాలాజీనగర్‌కు చెందిన గాజుల రాజేశ్ (17)లు జూన్ 14న సింహాపురి ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. అలాగే మరో రైలులో తిరుమలగిరికి చెందిన శ్రావణ్‌కుమార్ (21), లాల్‌బజార్‌కు చెందిన మహేశ్‌లు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వారు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన చోరీలను ఒప్పుకున్నారు. వారి నుంచి 81 గ్రాముల బంగారం, రూ.2,25,000 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

289

More News