మాస్ లీడర్.. మల్లారెడ్డి

Tue,February 19, 2019 12:34 PM

CH Mallareddy take Oath as Minister

హైదరాబాద్ : చామకూర మల్లారెడ్డి ఈపేరు నగరవాసులకు సుపరిచితం. విద్యా సంస్థల అధినేతగా, స్వచ్ఛంద సేవకుడిగా, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఎంపీగా సేవలందించిన ఆయనను ఇప్పుడు మంత్రి పదవి వరించింది. రాజ్ భవన్ వేదికగా మల్లారెడ్డి కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగారు తెలంగాణకు ఆహర్నిశలు కష్టపడుతున్న సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో చోటుదక్కింది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా మాస్ లీడర్‌గా గుర్తింపు పొందిన ఆయన ఇక నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రిగా ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నిక శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఆయనకు మంత్రి పదవి వరించింది. ఈ నేపథ్యంలోనే చామకూర రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా అవకాశం కల్పించారు.

రాజకీయంగా మల్లారెడ్డి పేరంటే సంచలనం. ఆయన 2014 ఎన్నికల్లో అనుహ్యంగా ఎంపీ టిక్కెట్‌ దక్కించుకుని మల్కాజిగిరి పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 16వ లోక్‌సభలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పార్లమెంట్‌ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా సేవలందించారు. మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు పేరు ప్రకటించే వరకు రంగారెడ్డి జిల్లాకు ఈసారి మంత్రి పదవి దక్కదని అందరూ అనుకున్నప్పటికీ అనుమానాలు పటాపంచాలు చేస్తూ మల్లారెడ్డికి మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్యే టిక్కెట్‌ విషయంలో కూడా తర్జనభర్జన పడి చివరి వరకు కూడా ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికి ఇస్తారో తెలియని పరిస్థితుల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కాదని ఎంపీగా ఉన్న మల్లారెడ్డి మేడ్చల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్‌ దక్కించుకుని భారీ మెజార్టీతో గెలుపొందారు.

5069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles