ఈసీ ఆదేశాల మేరకే రేవంత్ అరెస్ట్

Tue,December 4, 2018 02:04 PM

హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. కోస్గిలో టీఆర్ఎస్ నిర్వహించే సభను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తమకు టీఆర్ఎస్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో.. రేవంత్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. అక్కడి పరిస్థితిని స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నాం. ఆ తర్వాతనే రేవంత్ ను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించామని రజత్ కుమార్ తెలిపారు. రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై డీజీపీ, వికారాబాద్ జిల్లా ఎన్నికల అధికారి నివేదిక కోరామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో.. శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందనే ఆయనను ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

5608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles