రాష్ట్ర ఆరోగ్యశాఖ పనితీరును గుర్తించిన కేంద్రం: లక్ష్మారెడ్డి

Thu,March 23, 2017 09:33 PM

Central govt recognized the State Health Department

హైదరాబాద్: రాష్ట్ర ఆరోగ్యశాఖ పనితీరును గుర్తించి కేంద్ర ప్రభుత్వం అవార్డునిచ్చిందని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అటువంటి వైద్యారోగ్యశాఖ పనితీరుపై అసత్య ప్రచారాలతో పేద ప్రజలను భయపెట్టొద్దని ప్రతిపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నరని తెలిపారు. పద్దులపై చర్చ సందర్భంగా శాసనసభలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వాలు కార్పొరేట్ ఆస్పత్రులకు కొమ్ముకాశాయన్న మంత్రి పేదప్రజలకు లబ్ధి చేకూరేవిధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.

రాష్ట్రంలో శిశు మరణాల సంఖ్య బాగా తగ్గిందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు అనేక చర్యలు చేపట్టమన్నారు. ఈ క్రమంలో భాగంగానే ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 20 శాతం పెరిగాయని తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరిచామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగు పరిచామన్నారు. బీబీనగర్ నిమ్స్‌లో తర్వలోనే ఐపీ సేవలు ప్రారంభించనునట్లు వెల్లడించారు. అదేవిధంగా నిమ్స్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ బెడ్స్‌ను వందకు పెంచినట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ల సంఖ్యను పెంచుతామన్నారు. పుట్టిన శిశువులకు కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. గర్భిణీలకు రూ. 12 వేలు ఆర్థిక సాయం ఇస్తున్నమన్న ఆయన ఆడపిల్ల పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వాస్పత్రి నుంచి మృతదేహాలు తరలించేందుకు 50 వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంత దూరప్రాంతమైనా వ్యయప్రయాసలు యోచించకుండా ఉచితంగానే మృతదేహాలు తరలిస్తున్నమన్నారు. లంచాలు తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. 102 వాహనాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మార్చి 18 నుంచి అన్ని ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులు పనిచేస్తున్నయని తెలిపారు. ఇప్పటి వరకు హెల్త్‌కార్డుల ద్వారా 2 వేల మందికి సర్జరీలు కూడా చేసినట్లు చెప్పారు. వచ్చే రెండేళ్లలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles