మిషన్ భగీరథపై అధ్యయానికి కేంద్ర బృందం

Wed,May 15, 2019 09:52 AM

central committee visit telangana for study on mission bhagiratha

హైదరాబాద్ : మిషన్ భగీరథ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం ఈ రోజు రాష్ర్టానికి వస్తున్నది. దేశంలోని తాగునీటి పథకాల పనితీరు పరిశీలనకు కేంద్ర తాగునీటి విభాగం అధికారులు వివిధ రాష్ర్టాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర తాగునీటి విభాగం ఉప సలహాదారు డీ రాజశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం మూడురోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నది. ఎల్లూరులోని ఇంటెక్‌వెల్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌తోపాటు భగీరథ నీరు సరఫరా అవుతున్న గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటుంది.

రేపు సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామాల్లో పర్యటిస్తుంది. ఆయా గ్రామాల్లో ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది.17న శుక్రవారం ఎర్రమంజిల్‌లోని మిషన్‌భగీరథ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమావేశమవుతుంది.

819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles