రైతులకు నష్టం జరగకుండా చూడాలి: హరీశ్‌రావు

Tue,February 13, 2018 08:25 PM

center government exhibits anti-farmer trend Harish Rao

హైదరాబాద్: బీఆర్‌కే భవన్‌లో కందుల కొనుగోళ్లపై మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కంది రైతుల బకాయిల చెల్లింపునకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే కందుల దిగుబడి అనూహ్యాంగా ఉన్న నేపథ్యంలో ఇతర రాష్ర్టాల నుంచి దొడ్డిదారిన దిగుమతి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇరుగుపొరుగు రాష్ర్టాల సరిహద్దులో ఉన్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులతో జాయింట్ తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ రైతులకు నష్టం జరగకుండా చూడాలి. మార్కెటింగ్ అధికార యంత్రాంగం క్రియాశీలకంగా పనిచేయాలి. మార్క్‌ఫెడ్, హాకా వంటి ఏజెన్సీల అధికారులు ప్రతి రోజు సాయంత్రానికి కందుల క్రయ విక్రయాలు సమీక్షించాలి. కొనుగోలు కేంద్రాల దగ్గర దీర్ఘకాలంగా పనిచేసే సిబ్బందిని తరుచూ ఇతర కొనుగోలు కేంద్రాలకు మార్చాలని ఆదేశించారు.

నారాయణఖేడ్, నల్లగొండ, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో రైతుల ముసుగులో కందులు అమ్మకాలు జరిపిన వ్యాపారులపై చర్యలు తీసుకున్నాం. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై స్థానిక వ్యవసాయ అధికారుల తనిఖీ చేసి ధృవపత్రం ఇచ్చిన తరువాతే సరుకులు కొనుగోలు చేయాలని తెలిపారు. డబ్బులు ఇచ్చే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 10 క్వింటాళ్లకు పైగా కందులను మార్కెట్‌కు తెచ్చిన వారిపై నిఘా పెట్టాలి. రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

1227
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS