కేంద్రం రైతు వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది: హరీశ్‌రావు

Tue,February 13, 2018 07:15 PM

center government exhibits anti-farmer trend Harish Rao

హైదరాబాద్: బీఆర్‌కే భవన్‌లో కందుల కొనుగోళ్లపై మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతులకు మద్దతు ధర కల్పించడంలో, కందుల సేకరణలో కేంద్ర వైఖరిపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ధోరణ ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కందుల కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్రం ఉదాసీనతపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు రాసిన లేఖలపై స్పందన లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. రైతులు పండించిన కందులన్నింటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న ఢిల్లీలో కందుల కొనుగోలుపై మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.

1183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS