జైళ్లలో సీసీటీవీలు, కెమెరాల ఏర్పాటు..

Mon,November 9, 2015 07:38 AM

cc televisions and cameras in Prisons

రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల భద్రతపై తెలంగాణ జైళ్లశాఖ దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు ఖైదీల కదలికలపై నిఘా పెట్టేందుకు బ్యారెక్స్ వద్ద సీసీ కెమెరాలు, టీవీలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో దాదాపు 6000 మంది ఖైదీలున్నారు. వీరిలో కొంతమంది ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరగాళ్లు, రౌడీషీటర్లు, ఫ్యాక్షనిస్టులున్నారు. గతంలో నేరగాళ్లు జైళ్లను కేంద్రంగా చేసుకొని నేరాలకు వ్యూహరచన చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రత చర్యలపై జైలుశాఖ దృష్టిసారించింది. ఈ ప్రతిపాదనను అధికారులు చేసినా.. అప్పటి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో అమలుకు నోచుకోలేదని అధికారులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జైళ్లలో సంస్కరణలకు పెద్దపీట వేసింది. ఖైదీల సంక్షేమం, జైళ్లలో పరిశ్రమల ఏర్పాటు, సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే భద్రతపై దృష్టి పెట్టిన జైళ్లశాఖ సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles