సుజనా చౌదరి కేసులో సీబీఐ సోదాలు

Sat,June 1, 2019 05:06 PM

CBI searches in sujana chowdary case

హైదరాబాద్: సుజనా చౌదరి కేసులో దేశంలో 12 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరు బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించనందుకు కంపెనీపై కేసు నమోదు చేశారు. ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు నుంచి కంపెనీ రుణాలు తీసుకుంది. రూ.360 కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు రెండేండ్ల క్రితం కేసు నమోదు చేశారు. కంపెనీ ఎండీతో పాటు డ్రైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని సుజనా చౌదరి ఇల్లు, కార్యాలయాల్లో, శ్రీనగర్ కాలనీలోని సుజనా చౌదరి నివాసంలో, జూబ్లిహిల్స్, పంజాగుట్టలోని కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది.

1154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles