ఓటు హక్కు మన బాధ్యత.. తప్పనిసరిగా వినియోగించుకుందాం..!

Thu,December 6, 2018 03:54 PM

casting vote is our responsibility please utilize it

మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలే తమను పాలించే ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. చట్ట సభలకు వారిని పంపుతారు. అలాంటి గొప్ప అవకాశాన్ని మనకు ఓటు హక్కు కల్పిస్తున్నది. కానీ.. నేటి ఆధునిక యుగంలో పోలింగ్ రోజున సెలవు దొరికితే ఎంజాయ్ చేసేవారే ఎక్కువగా ఉన్నారు తప్ప ఓటు హక్కును బాధ్యతగా గుర్తించేవారు తక్కువయ్యారు. 5 ఏళ్ల పాటు మనల్ని పాలించే నాయకులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవడంలో మనమే నిర్లక్ష్యం వహిస్తాం. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాలని మళ్లీ వారి వద్దకే వెళతాం. మరి ఓటు హక్కు అసలు వినియోగించుకోకపోతే మనకు ప్రశ్నించే అధికారం ఎలా వస్తుంది ? అని ఒక్కసారి కూడా ఆలోచించం. కనుక ఈ సారైనా ఆలోచించండి. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండి.. కానీ ఓటు వేయడం మాత్రం మరిచిపోకండి..!

1034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS