కేసుల విచారణలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం

Wed,November 11, 2015 06:12 AM

Cases in the state's Consumer Forum

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం పూర్తిస్థాయిలో విధులకు శ్రీకారం చుట్టింది. ఫోరం ఏర్పాటైన సుమారు ఏడాది తర్వాత గత సోమవారం నుంచి వినియోగదారుల ఫిర్యాదులపై విచారణ ప్రారంభించింది. ఫోరం తొలి అధ్యక్షుడిగా నియమితులైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ రావు నల్లా సోమవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ కేసు గురించి ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ఉమ్మడిగా ఏపీ వినియోగదారుల ఫోరం కొనసాగింది.

తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేస్తూ గత ఏడాది అక్టోబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఫోరం అధ్యక్షుడి నియామక విషయంలో కొంత జాప్యం జరిగింది. నిబంధనల ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తి హోదా ఉన్నవారినే అధ్యక్షుడిగా నియమించాల్సి ఉండటంతో పోస్టును భర్తీ చేయడానికి ప్రభుత్వం కొంత సమయం తీసుకొంది.

దీంతో ఏడాదిగా తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం విధులను కొనసాగించలేకపోయింది. తాజాగా అధ్యక్షుడి నియామకం జరుగడంతో కేసుల పరిష్కారం ప్రారంభమైంది. అధ్యక్షుడితోపాటు ఫోరంలో ఉండాల్సిన సభ్యుల నియామక చర్యలు త్వరలో పూర్తికానున్నాయి. కన్జూమర్ ప్రొటెక్షన్ చట్టం నిబంధనల ప్రకారం న్యాయశాఖ కార్యదర్శి ఒక సభ్యుడిగా, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి లేదా అదే హోదా గల మరో అధికారి సభ్యులుగా ఉండాలి. నిబంధనల ప్రకారం వీరిద్దరిని సభ్యులుగా నియమిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీకానున్నాయి. రాష్ట్ర వినియోగదారుల ఫోరంతో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని జిల్లా వినియోగదారుల ఫోరాలు వివాదాలను పరిష్కరిస్తూ తమ విధులను కొనసాగిస్తున్నాయి.

973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles