ప్రేమించాలంటూ వేధింపులు..యువకుడిపై కేసు

Tue,April 16, 2019 07:23 AM

CASE REGISTERED ON A YOUTH IN Harassment


బంజారాహిల్స్ : ప్రేమించాలంటూ వివాహితను వేధిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..ఫిలింనగర్‌లోని పటేల్‌నగర్‌లో నివాసం ఉంటున్న వివాహిత(26) భర్తతో గొడవల కారణంగా తన ముగ్గురు పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నది. గతంలో కొన్నాళ్లపాటు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న సమయంలో అక్కడే సెట్‌ వర్కర్‌గా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫోన్‌ నంబర్‌ తీసుకుని తరుచూ ఫోన్‌ చేస్తుండడంతోపాటు తనను ప్రేమించాలంటూ వేధించడం ప్రారంభించాడు.

దీంతో అక్కడ పని మానేసిన వివాహిత ఏడునెలలుగా ప్రైవేటు సంస్థలో రిసెప్షనిస్ట్‌గా చేస్తున్నది. అయితే అమె నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకున్న రాజు... రోజూ పనికి వెళ్లే సమయంలో ఆమెను ఇబ్బంది పెడుతుండంతో పాటు అడ్డగిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే అంతుచూస్తానంటూ హెచ్చరిస్తున్నాడు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1947
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles