బాలుడిపై బ్యాట్ తో దాడి..యువకుడిపై కేసు

Fri,May 3, 2019 06:53 AM

case on youth who beat a boy with bat


బంజారాహిల్స్‌ : క్రికెట్‌ ఆడుతున్న స్నేహితుల మధ్య చోటుచేసుకున్న గొడవలో తలదూర్చి బాలుడిని క్రికెట్‌ బ్యాట్‌తో తీవ్రంగా గాయపర్చిన యువకుడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని నందినగర్‌లో నివాసముంటున్న రాహుల్‌(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి తన తమ్ముడు, స్నేహితులతో కలిసి గత నెల 30న స్థానికంగా క్రికెట్‌ ఆడాడు. ఆటలో వేరే స్నేహితుడితో స్వల్ప గొడవ జరిగింది. కాసేపటికి గొడవ మానుకున్నారు.

అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న రాహుల్‌ను అడ్డగించిన సాయి(25)అనే యువకుడు బ్యాట్‌తో రాహుల్‌ కాళ్లు, చేతులపై చితకబాదాడు. ఈ దాడిలో రాహుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. రాహుల్‌ జరిగిన విషయాన్ని తల్లి మంజులకు చెప్పగా, ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించిన తల్లి మంజుల గురువారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సాయి అనే యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

1413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles