బాలికను మోసం చేసిన మేస్త్రీపై ఫిర్యాదు

Tue,April 16, 2019 09:20 AM

case filed against a man in love fraud


బషీరాబాద్‌: ముగ్గురు సంతానం కలిగిన ఓ వ్యక్తి గిరిజన బాలికను ప్రేమిస్తున్నానని, లోబరుచుకొని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి ఇరు కుటుంబాలు బషీరాబాద్‌ స్టేషన్‌కు చేరుకొని పంచాయితీ పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాకు చెందిన మల్లెల సురేశ్‌ తాండూరులో భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తాడు. అతడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. బషీరాబాద్‌ మండలంలోని భోజ్యానాయక్‌తండాకు చెందిన 16 ఏళ్ల బాలిక తన తండ్రిలో కలిసి సురేశ్‌ వద్ద రోజుకూలీగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో బాలికను ప్రేమిస్తున్నాని నమ్మించి, ఈ నెల 12న బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం బాలిక ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన తల్లిదండ్రులు అదే రోజు బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సురేశ్‌ తనతో పాటు తీసుకెళ్లిన బాలికతో సోమవారం బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. తాము పెండ్లి చేసుకున్నామని వివరించారు. తనకు ఇంతకు ముందే భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని, భార్య సమ్మతితోనే పెండ్లి చేసుకున్నానని వివరించాడు. బాలికను మోసం చేయడమే కాకుండా పెండ్లి చేసుకోవడం మరో నేరమని బాలిక తరుపున బంధువులు పేర్కొంటున్నారు. రెండు కుటుంబాలు పోలీస్‌స్టేషన్‌ గొడవకు దిగారు. బాలిక కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా.. స్టేషన్‌లో ఎస్సై అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఠాణాకు ఇరుకుటుంబాలు రావాలని పోలీసులు సూచించారు.

2781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles