ఓటేసి బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసిన ఓటరుపై కేసు

Sun,May 12, 2019 01:00 PM

case against voter photo taken ballot paper

మహబూబ్‌నగర్: 10వ తేదీన జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటరు బ్యాలెట్ పత్రాలను ఫోటో తీసుకున్నాడు. బ్యాలెట్ పత్రాలను ఫోటో తీసుకోవడాన్ని అధికారులు గమనించలేదు. దేవరకద్ర మండలం మీనుగోనుపల్లి పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు చక్కర్లు కొట్టడంతో అధికారులు చర్యలు చేపట్టారు. బ్యాలెట్ పత్రాల క్రమసంఖ్య ఆధారంగా ఓటరును అధికారులు గుర్తించారు. నిబంధనల మేరకు ఓటరుపై చర్యలు తీసుకోవాలని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

1776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles