అంతర్జాతీయ స్థాయిలో కోరుట్ల కార్టూనిస్టు ప్రతిభ

Sun,July 21, 2019 08:37 AM

cartoonist parameswar won award in International cartoonist Competitions

హైదరాబాద్: కెనడాలో తెలుగువారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్టూన్ పోటీల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామానికి చెందిన ఉషకోల పరమేశ్వర్ ద్వితీయ బహుమతి పొందారు. కెనడాలో శ్రీముదిగొండ మల్లికార్జునరావు స్మారకార్థం కెనడా తెలుగు మాసపత్రిక వారు పోటీలు నిర్వహించగా అంతర్జాతీయస్థాయిలో ఆయా దేశాల్లోని తెలుగు కార్టూనిస్టులు తమ కార్టూన్లను పోటీలకు పంపారు. పర్యావరణ పరిరక్షణపై ఉషకోల పరమేశ్వర్ గీసిన కార్టూన్‌కు ద్వితీయ స్థానం దక్కింది.

458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles