కార్టూనిస్ట్ మృత్యుంజయకు శేఖర్ స్మారక అవార్డు

Mon,March 20, 2017 08:49 PM

హైదరాబాద్ : నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్ మృత్యుంజయను కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు వరించింది. నవ తెలంగాణ దినపత్రిక ఏర్పాటైన తర్వాత ప్రతి సంవత్సరం కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డును అందజేస్తున్నది. 2016 సంవత్సరానికి గానూ మృత్యుంజయను జ్యూరీ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మృత్యుంజయకు మార్చి 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న నవతెలంగాణ వార్షికోత్సవంలో అవార్డును అందజేయనున్నట్లు నవతెలంగాణ ఎడిటర్ ఎస్. వీరయ్య, సీజీఎం శ్రీనివాస్ ప్రకటించారు. ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరుగనున్నది. జ్యూరీ ఛైర్మన్‌గా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, సభ్యులుగా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్, 10 టీవీ అసోసియేట్ ఎడిటర్ శ్రీధర్‌బాబు ఉన్నారు.

369

More News

మరిన్ని వార్తలు...