వరుసగా ఢీకొన్న మూడు కార్లు

Sat,January 12, 2019 10:06 AM

cars accident in rangareddy district

రంగారెడ్డి: జిల్లాలోని నందిగామ మండల పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న వాహనాలను పొగ మంచు అడ్డుకుంది. మంచు కారణంగా దారి కనిపించక.. వరసుగా మూడు కార్లు ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది. ఇవాళ ఉదయమే షాద్ నగర్ కొత్తూరు వద్ద కూడా దట్టమైన మంచు కారణంగా 3 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, 2 లారీలు, ఆటో, కారు ఒకదాన్ని మరోటి ఢీకొని ధ్వంసమయ్యాయి.

1002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles