మామడ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్

Sat,February 23, 2019 11:21 AM

cardon search operation in mamada police station limits

నిర్మల్: జిల్లాలోని మామడ పీఎస్ పరిధిలోని దిమ్మదుర్తి గ్రామంలో ఈ ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా ఎస్పీ సి. శశిథర్‌రాజు నేతృత్వంలో అదనపు ఎస్పీ దక్షిణమూర్తి, డీఎస్పీ డి. ఉపేంద్రరెడ్డి, సీఐలు జాన్ దివాకర్, రమేష్‌బాబు, ఆర్ వెంకటి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసు సిబ్బంది సరైన పత్రాలులేని 46 బైక్‌లు, 3 ఆటోలు, 50 వేల విలువైన మద్యం, రూ. లక్ష విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేరస్తుల కదలికలపై నిఘా కొనసాగించడం జరుగుతుందన్నారు. గ్రామంలోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానికులకు సూచించారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.

595
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles