బీజేపీ టీషర్టులతో కారు పట్టివేత.. సీజ్

Wed,November 14, 2018 09:53 PM

car seized with bjp t shirts in kesamudram

మహబూబాబాద్: బీజేపీ టీషర్టులను తీసుకెళ్తున్న కారును పోలీసులు గుర్తించారు. జిల్లాలోని కేసముద్రం మండలం కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఎస్సై సతీశ్ తెలిపిన ప్రకారం.. ఎన్నికల నేపథ్యంలో కేసముద్రంలోని ఫ్లయి ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా ఉప్పరపల్లి రోడ్డులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారును ఆపి పరిశీలించగా భారతీయ జనతా పార్టీకి చెందిన టీషర్టులు కనిపించాయి. టీషర్టులను స్వాధీనం చేసుకుని, కారును సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles